AP Forest Beat Offcer Jobs 2025 (691) : Exam Date, Salary @ psc.ap.gov.in
AP Forest Beat Offcer Jobs 2025 Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా ఫారెస్ట్ శాఖలోని ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
ఈ AP FBO నోటిఫికేషన్ 2025 కింద మొత్తం 691 ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 256 పోస్టులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసమైతే, మిగతా 435 పోస్టులు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌ల కోసం కేటాయించబడ్డాయి. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తమ OTPR ఐడీ ద్వారా ఆన్‌లైన్‌లో ఫారం నింపాలి.
ఈ AP Forest Beat Officer Notificaton 2025 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూలై 16, 2025 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు సంబంధించిన లింక్, పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, వయస్సు పరిమితి, ఎంపిక విధానం వంటి సమాచారం అధికారిక వెబ్‌సైట్ అయిన www.psc.ap.gov.in లో అందుబాటులో ఉంది.
SSC Stenographer Admit Card 2025 Release Date : (పరీక్షా తేదీలు ఆగస్టు 6 నుంచి 11)
AP Forest Beat Offcer Jobs 2025
అభ్యర్థులు నోటిఫికేషన్ నెంబర్ 06/2025 ఆధారంగా వివరాలను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తు చేయాలి. అభ్యర్థిత్వానికి సంబంధించిన విద్యార్హతలు, పరీక్షా విధానం, మరియు దరఖాస్తు విధానం గురించి పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది.
APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2025
వివరాలు | ముఖ్యమైన సమాచారం |
---|---|
నోటిఫికేషన్ విడుదల తేదీ | జూలై 16, 2025 |
ఉద్యోగాల పేరు | ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) |
మొత్తం ఖాళీలు | 691 పోస్టులు |
ప్రతి పోస్టు ఖాళీలు | 256 – FBO 435 – ABO |
నియామక విధానం | ఏపీ ఫారెస్ట్ Exam Written Test |
దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ (OTPR ID ఉపయోగించి) |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూలై 16, 2025 |
దరఖాస్తు చివరి తేదీ | ఆగస్టు 5, 2025 |
AP FBO అడ్మిట్ కార్డ్ తేదీ | పరీక్ష తేదీ కి 7 రోజుల ముందు |
పరీక్ష తేదీ | సెప్టెంబర్ 7, 2025 |
ఎంపిక విధానం | రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా |
విద్యార్హత | ఇంటర్మీడియట్ (10+2) లేదా దీని సమానమైన విద్య |
వయస్సు పరిమితి | 18 నుండి 30 ఏళ్లు |
నోటిఫికేషన్ నంబర్ | ప్రకటన సంఖ్య 06/2025 |
ఆధికారిక వెబ్‌సైట్ | psc.ap.gov.in |
ముఖ్యమైన వివరాలు : AP FBO నోటిఫికేషన్ 2025 చివరి తేదీ
-
ఫారెస్ట్ విభాగంలో మొత్తం ఖాళీలు 691 గా పేర్కొనబడ్డాయి.
-
వాటిలో 256 FBO పోస్టులు కాగా, 435 ABO ఖాళీలు ఉన్నాయి.
-
ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాల లోపల ఉండాలి.
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
-
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ లోనే నిర్వహించబడుతుంది.
AP High Court Hall Ticket 2025 Release Date : (జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ )
అర్హతలు : AP FBO Eligibility 2025
-
కనీసం ఇంటర్మీడియట్ (12వ తరగతి) పాస్ అయిన అభ్యర్థులు అర్హులు.
-
శారీరక ప్రమాణాల పరంగా ఎత్తు, ఛాతీ విస్తరణ వంటి అంశాలలో కూడా అర్హతలు ఉండాలి.
-
పురుష అభ్యర్థులకు కనీస ఎత్తు 163 సెం.మీ, ఛాతీ విస్తరణ 5 సెం.మీ ఉండాలి.
-
మహిళలకి ఎత్తు 150 సెం.మీ ఉండాలి.
-
శారీరక పరీక్షలకూ సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.
జీతం వివరాలు : AP Forest Beat Officer Salary
-
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుకు నెల జీతం రూ. 25,220 నుండి రూ. 80,910 వరకు ఉంటుంది.
-
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగానికి రూ. 23,120 నుండి రూ. 74,770 వరకు జీతం లభిస్తుంది.
-
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర భత్యాలు కూడా కల్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పరీక్షకు సంబంధించిన తేదీని ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.
-
AP Forest Beat Officer Exam Date 2025 : సెప్టెంబర్ 7th, 2025
AP High Court Exam Date 2025 : హైకోర్టు పరీక్ష తేదీ, ప్యాటర్న్