Results

TS POLYCET 2025 1st Phase Seat Allotment Results

Telangana POLYCET 2025 Allotment Phase 1

తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష  TS POLYCET 2025 1st Phase Seat Allotment  కోసం విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మొదటగా జూలై 4న విడుదల కావాల్సిన ఫలితాలు సాంకేతిక లోపాల వల్ల ఆలస్యం అయ్యాయి. ఈ సీటు కేటాయింపు ప్రక్రియపై అధికారులు ఇంకా ఖచ్చితమైన సమాచారం ఇవ్వకపోవడంతో, పలువురు విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరాలా లేక పాలిసెట్ ఫలితాల కోసం వేచి ఉండాలా అనే సందిగ్ధంలో ఉన్నారు.

అయితే Latest సమాచారం ప్రకారం TS POLYCET 2025 1st Phase Seat Allotment Results ఈ వారం విడుదల అయ్యే అవకాశం ఉంది. తలెత్తిన సాంకేతిక సమస్యలు త్వరగా పరిష్కరించి, సీటు కేటాయింపు ఆర్డర్లు సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు. విద్యార్థులకు సీటు కేటాయింపుపై క్లారిటీ ఇవ్వడం కోసం అధికార వెబ్‌సైట్‌ ద్వారా లింక్‌ను త్వరలోనే యాక్టివేట్ చేయనున్నారు.

AP IIIT 2025 2nd Phase Cut Off Marks : రెండవ దశ కౌన్సిలింగ్

TS POLYCET 2025 1st Phase Seat Allotment Results

విభాగం వివరాలు
ఫలితాల విడుదల తేదీ 2025 జూలై 5 లేదా 6 (అంచనా)
 ఫలితాలు విడుదలచేసే వెబ్‌సైట్ tspolycet.nic.in
 ఫలితాల లింక్ “First Phase Seat Allotment Order” లింక్ ద్వారా పొందుపరచబడుతుంది
 లాగిన్ సమాచారం హాల్ టికెట్ నంబర్ / మొబైల్ నంబర్ / పాస్‌వర్డ్ అవసరం
 సీటు వివరాలు కేటాయించిన కాలేజీ పేరు, బ్రాంచ్ పేరు టేబుల్‌లో చూపబడుతుంది
 ఫీజు చెల్లింపు సీటు వచ్చిన తర్వాత సంబంధిత కాలేజీలో ఫీజు చెల్లించాలి
 సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్‌లైన్ లేదా కాలేజీకి స్వయంగా వెళ్లి రిపోర్ట్ చేయాలి
 అధికారుల తాజా సమాచారం సాంకేతిక సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు
తదుపరి దశ రెండవ దశ కౌన్సిలింగ్ తేదీలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది

TS POLYCET Allotment 2025 ఫలితాలను ఎలా తెలుసుకోవాలి?

TS POLYCET 2025 1st Phase Seat Allotment తెలుసుకునేందుకు విద్యార్థులు అధికారిక సైట్‌ తరచూ చెక్ చేయాలి. హోం పేజీలో ఉండే “ Seat Allotment Order” అనే లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీ హాల్ టికెట్ నంబర్ లేదా లాగిన్ వివరాలతో లాగిన్ అయి, సీటు కేటాయింపు ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్‌లో మీరు ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్‌కు కేటాయించబడారో వివరాలు ఉంటాయి. సీటు వచ్చినవారు కాలేజీకి వెళ్లి ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరిగా చేయాలి.

ఏ మార్పు అయినా వెంటనే తెలుసుకునేందుకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ పరిశీలించడం మంచిది. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు అధికారిక నోటిఫికేషన్ ఛానెల్స్‌ను ఫాలో కావాలి.

AP ICET Counselling Dates 2025 : పరీక్ష తేదీ, హాల్ టికెట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *